Site icon NTV Telugu

Railway Jobs 2023: రైల్వేలో 3,093 అప్రెంటిస్‌లు… అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ..

Railway Jobs

Railway Jobs

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. అలాగే ఇప్పటికే పలు పోస్టులను భర్తీ చేసింది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 3,093 అప్రెంటిస్‌లు ఉన్నాయి.. అర్హతలు, చివరి తేదీ తెలుసుకుందాం..

మొత్తం ఖాళీల సంఖ్య -3,093

పోస్టుల వివరాలు..

క్లస్టర్‌ లక్నో, క్లస్టర్‌ అంబాలా, క్లస్టర్‌ ఢిల్లీ, క్లస్టర్‌ ఫిరోజ్‌పూర్‌..

అర్హతలు..

పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి..

ట్రేడ్‌లు..

మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్‌ అండ్‌ హీట్‌ ట్రీటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్, రిఫ్రిజిరేటర్‌ అండ్‌ ఏసీ మెకానిక్‌ తదితరాలు.

వయోపరిమితి..

11.01.2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు..

దరఖాస్తు విధానం..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 11.12.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.01.2024.
మెరిట్‌ జాబితా వెల్లడి తేది: 12.02.2024..

ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడాని కి అధికార వెబ్ సైట్.. https://www.rrcnr.org/ ను పరిశీలించగలరు..

Exit mobile version