బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంక్ పీఎన్‌బీ లోభారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,025 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఆ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం 1,025 పోస్ట్‌లు..
పీఎన్‌బీ తాజా నోటిఫికేషన్ ద్వారా నాలుగు విభాగాల్లో మొత్తం 1,025 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఇందులో ఆఫీసర్-క్రెడిట్ 1000 పోస్ట్‌లు, మేనేజర్-ఫారెక్స్ 15 పోస్ట్‌లు, మేనేజర్-సైబర్ సెక్యూరిటీ 5 పోస్ట్‌లు, సీనియర్ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ-5 పోస్ట్‌లు ఉన్నాయి.
అర్హతలు..
పోస్ట్‌లను అనుసరించి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి..
వయోపరిమితి..
క్రెడిట్ ఆఫీసర్‌కు 21-28 ఏళ్లు; ఫారెక్స్ మేనేజర్, సైబర్ సెక్యూరిటీ మేనేజర్‌కు 25-35 ఏళ్లు; సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ పోస్ట్‌కు 27-38 ఏళ్లు ఉండాలి. నిబంధనలను అనుసరించి రిజర్వ్‌డ్ కేటగిరీ వర్గాలకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది..
ఎంపిక ప్రక్రియ..
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి రెండంచెల ఎంపిక విధానాన్ని అనుసరిస్తారు. తొలుత రాత పరీక్ష ఉంటుంది. అందులో ప్రతిభ, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు..
జీతాలు..
జేఎంజీఎస్-1కు రూ.36,000-రూ.63,840తో ప్రారంభ వేతన శ్రేణి ఉంటుంది.
ఎంఎంజీఎస్-2కు రూ.48,170-రూ.69, 810 శ్రేణిలో ప్రారంభ వేతనం లభిస్తుంది.
ఎంఎంజీఎస్-3కు రూ.63,840-రూ.78,230 శ్రేణిలో ప్రారంభ వేతనం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, ఫిబ్రవరి 25.
ఆన్‌లైన్ టెస్ట్ తేదీ: మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
వెబ్‌సైట్: https://www.pnbindia.in/Recruitments.aspx మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.