Online Courses: తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలకు హునార్ ఆన్‌లైన్ కోర్సెస్ బాసటగా నిలుస్తోంది. 30కి పైగా క్రియేటివ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ 15 వేల మందికి పైగా మహిళలు శిక్షణ పొందారు. అందులో 2 వేల మందికి పైగా బిజినెస్‌లను ప్రారంభించారు. ఈ కోర్సులు ముఖ్యంగా యాప్ బేస్డ్. అందుకే 20 లక్షలకుపైగా యాప్ డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. గార్మెట్ మేకింగ్, బేకింగ్, బ్యూటీ కోర్సులు, స్టైలింగ్, బ్యాగ్ మేకింగ్, ఫ్యాషన్ ఇలస్ట్రేషన్, జ్యూలరీ డిజైనింగ్, బొటిక్ మేనేజ్మెంట్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రి డిజైనింగ్, హోమ్ డెకర్, షార్ట్ కోర్సెస్, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర కోర్సులు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
ఫ్యాషన్ డిజైన్, జ్యూలరీ డిజైన్, హోం డెకర్ కోర్సులకు హ్యునార్.. ఇండియాలోనే బెస్ట్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంగా నిలుస్తోంది. 30 ఏళ్లకు పైగా అనుభవంతో 24×7 ఫ్యాకల్టీ సపోర్ట్‌తో ఈ కోర్సులన్నీ ఇంటి నుంచే నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మరిన్ని వివరాల కోసం ‘హునార్ ఆన్‌లైన్ కోర్సెస్’ ఫౌండర్ అండ్ సీఈఓ నిష్తా యోగేష్ ‘ఎన్-బిజినెస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడొచ్చ. ఆ వీడియో లింక్ కిందనే ఉంది గమనించగలరు.