Site icon NTV Telugu

NTPC 2024: ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. జీతం ఎంతంటే?

Jobbss

Jobbss

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేసింది.. ఇప్పుడు మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.. అర్హతలు, జీతం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 25న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు..

పోస్టుల వివరాలు..

పోస్టుల కేటాయింపు:యూఆర్-98, ఈడబ్ల్యూఎస్-22, ఓబీస-40, ఎస్సీ-39, ఎస్టీ-24.

అర్హతలు..

బీఈ, బీటెక్ (ఎలక్ట్రికల్/ మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి..

వయోపరిమితి..

35 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు:రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది..

ఎంపిక విధానం..

అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్లిస్టింగ్, సెలెక్షన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

జీత భత్యాలు..

నెలకు రూ.55,000.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.02.2024.

ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించగలరు..

Exit mobile version