నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ప్రభుత్వం.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లోని పలు ఖాళీలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం రెండు పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం మంచిది..
అర్హతలు
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుండి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి..
వయస్సు..
ఈ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థుల వయస్సు నవంబర్ 14, 2023 నాటికి గరిష్టంగా 35 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్‌కు లోబడి అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వబడుతుంది..
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇండియాలో ఎక్కడైనా ఉద్యోగం చేయాల్సి ఉంటుంది..
జీతం..
నెలకు రూ. 75,000
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు నవంబర్ 14,2023 లోపు నింపిన దరఖాస్తు ఫారమ్‌ను అవసరమైన పత్రాలతో పాటు ఈ-మెయిల్ ఐడి hr.nhipmpl@nhai.org కు పంపాలి..
ఇక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే..
ఇ-మెయిల్ పంపడానికి చివరి రోజు: నవంబర్ 14, 2023..
ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవాలి..