NTV Telugu Site icon

Navy Jobs 2023: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు..దరఖాస్తు చేసుకోవడానికి రెండు రోజులే గడువు..

Navy Jobs (2)

Navy Jobs (2)

ఇండియన్ నేవిలో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఖాళీ ఉన్న పలు పోస్టులకు సంబందించిన మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్‌ బ్రాంచీల్లో 224 ఖాళీల భర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

పోస్టుల వివరాలు..

ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌: మొత్తం 18 ఖాళీలు. వీటికి నిర్దేశిత విభాగాల్లో బీఎస్సీ/ ఎమ్మెస్సీ/ బీఈ/ బీటెక్‌ 60 శాతం మార్కులు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

టెక్నికల్‌ బ్రాంచ్‌: ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లో 30, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లో 50, నేవల్‌ కన్‌స్ట్రక్టర్‌ విభాగంలో 20 ఖాళీలు ఉన్నాయి. వీటికి నిర్దేశిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్‌ 60 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు.

అర్హతలు..

ఇంజినీరింగ్, పీజీ డిప్లొమా, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు వీటికి పోటీ పడొచ్చు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఇంటర్వ్యూ కు పిలుస్తారు.. అకడమిక్‌ ప్రతిభతో అభ్యర్థులను వడపోస్తారు.. ఒక్కో పోస్టుకు కొంత మందిని చొప్పున సెలక్ట్ చేసి, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో మెరిట్‌ మార్కులు పొందినవారికి మెడికల్ టెస్ట్ లు నిర్వహించి జాబ్ లోకి తీసుకుంటారు…NCC సీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి ప్రాధాన్యం. అన్ని పోస్టులకూ 60 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్వ్యూలో విజయవంతమైనవారికి నేవల్‌ అకాడెమీ, ఎజిమాళలో వచ్చే జూన్‌ నుంచి 44 వారాలపాటు శిక్షణ ఇస్తారు.. ఆ తర్వాత వారిని విధుల్లోకి తీసుకుంటారు..

వయోపరిమితి..

అన్ని పోస్టులకూ ఆ విభాగాన్ని బట్టి జులై 2, 1999/2000 – జనవరి/జులై 1, 2003/2005 మధ్య జన్మించాలి..

జీతం..

ఇందులో సెలెక్ట్ అయ్యిన వారికి శాలరీ నెలకు రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి. అందువల్ల తొలి నెల నుంచే వీరు రూ.లక్షకు పైగా వేతనం పొందవచ్చు. ప్రొబేషన్‌ వ్యవధి రెండేళ్లు. వీరు పదేళ్లు విధుల్లో కొనసాగుతారు..

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ..అక్టోబరు 29.

ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే అధికార వెబ్‌సైట్‌.. https://www.joinindiannavy.gov.in/ సందర్శించండి..