NTV Telugu Site icon

Postal Jobs: పోస్టాఫీస్ లో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Post Office

Post Office

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోస్టాఫీస్ లో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి తీపి కబురు.. తాజాగా పోస్టాఫీస్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 32 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అర్హతలు పూర్తి వివరాలను తెలుసుకోవాలి..

మొత్తం పోస్టులు.. 32,000

విద్యార్హతలు..

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు SSC విద్యార్హత కలిగి ఉంటే సరిపోతుంది.

వయోపరిమితి..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవారికి కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,STలకు వయసు సడలింపు కూడా ఉంటుంది..

అప్లికేషన్ ఫీజు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.. SC ,ST PWD కాండిడేట్లకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు..

ఎంపిక విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందుగా మీరు అధికార వెబ్ సైట్ లోకి వెళ్లి నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..