Site icon NTV Telugu

Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?

Sam (3)

Sam (3)

చాలా మందికి ఇంట్లో బల్లులు ఉంటే నచ్చదు. దీంతో వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తుంటారు. బల్లి మీద పడగానే భయపడుతుంటారు. బల్లి ఇంట్లో ఉంటే కొందరు శుభ సూచకమని.. మరికొందరు అశుభమని భావిస్తుంటారు. మన దేశంలో బల్లి మీద పడగానే స్నానం చేసి దేవుడి పటాలను మొక్కుతుంటారు. అలాగే కంచి అమ్మవారి పుణ్యక్షేత్రంలో బంగారు, వెండి బల్లులను తాకుతారు. దీంతో తమ మీద పడిన బల్లి దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

ఇంట్లో బొద్దింకలు, బల్లులు ఉండటం చాలా సాధారణం. కొందరికి ఇంట్లో బల్లులు ఉండటం ఇష్టం ఉండదు. అలాంటివారు వాటిని తరమకుండా ఉండలేరు. బల్లి ఏం చేస్తుందిలే అని జాలిపడి ఇంట్లోని కీటకీలను తెరిచి ఊరికే వదిలేస్తుంటారు . జ్యోతిశాస్త్రం ప్రకారం బల్లి డబ్బుకు సంబంధించి శుభ సూచకంగా పరిగణిస్తారు. ఇంట్లోకి బల్లి రావడం, తరచూ కొన్ని ప్రదేశాలలో అది కనిపించడం, బల్లి మీద పడటం వంటివి కొన్ని ప్రత్యేక సంకేతాలను సూచిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంతో పాటు వాస్తు శాస్త్రంలో బల్లి కనిపిస్తే కలిగే శుభ, అశుభ సంకేతాలను గురించి తెలిపారు కొందరు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కొత్త ఇంటి కోసం వాస్తు పూజను వెండి బల్లి విగ్రహాలను ఉపయోగించి నిర్వహిస్తారు. బల్లి ఇంట్లో సంతోషాన్ని, సంపదను పెంచుతుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి పూజ గదిలో బల్లులు కనిపిస్తే చాలా శుభ శకునంగా భావిస్తారు. భవిష్యత్తులో మీరు మరింత డబ్బును పొందబోతున్నారని తెలుపుతుంది. మన దేశంలో బల్లి మీద పడగానే స్నానం చేసి దేవుడి పటాలను మొక్కుతుంటారు. అలాగే కంచి అమ్మవారి పుణ్యక్షేత్రంలో బంగారు, వెండి బల్లులను తాకుతారు. దీంతో తమ మీద పడిన బల్లి దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఆ సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇంట్లో రెండు బల్లులు కలిసి కనిపిస్తే పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి శుభం, అశుభం అనే సంబంధం లేదని అంటున్నారు. కానీ, రెండు బల్లులు పరస్పరం పోట్లాడుకుంటూ కనిపిస్తే మాత్రం అది అశుభానికి సంకేతం అంటున్నారు. కుటుంబంలో అనారోగ్యం, గొడవలు రాబోతున్నాయని సూచిస్తుందని చెబుతున్నారు. కానీ, బల్లులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని జ్యోతిష్య శాస్త్ర నిఫుణులు తెలుపుతున్నారు.

Exit mobile version