Site icon NTV Telugu

JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 రిజిస్ట్రేషన్ కు ఈరోజే లాస్ట్ డేట్..అప్లై చేసుకోండి..

Jee Mains

Jee Mains

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కు 2024 సెషన్ 1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. డిసెంబర్ 4 వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ ఫామ్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే jeemain.nta.ac వెబ్ సైట్ లో కరెక్షన్ విండో డిసెంబర్ 6వ తేదీన ఓపెన్ అవుతుంది.

ఇకపోతే డిసెంబర్ 8 వ తేదీ వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ జనవరి రెండవ వారంలో విడుదల అవుతాయి.. ఇక అడ్మిట్ కార్డులను మూడు రోజుల ముందు విడుదల చేస్తారు. JEE మెయిన్స్ సెషన్ 1 పరీక్షను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహిస్తారు.. జేఈఈకి ఎలా అప్లై చేసుకోవాలో మరోసారి చూద్దాం..

ముందుగా JEE మెయిన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న JEE మెయిన్ 2024 సెషన్ 1 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
తరువాత మీ రిజిస్టర్డ్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
అక్కడ కనిపించే దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
మీ అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోండి..
ఈ పరీక్షల గురించి మరింత సమాచారం కొరకు.. NTA హెల్ప్ డెస్క్‌ నంబర్ 011-40759000/ 011- 6922770 లకు కాల్ చేయవచ్చు. లేదా jeemain@nta.ac.in. కు మెయిల్ చేయవచ్చు.. ఈరోజు సాయంత్రం వరకే సమయం త్వరగా అప్లై చేసుకోండి..

Exit mobile version