Site icon NTV Telugu

IOCL Recruitment 2023: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 1720 ఉద్యోగాలు..

Jobs

Jobs

నిరుద్యోగులకు మరోసారి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాలకు దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం..1720 ట్రేడ్/ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. పలు విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎంపికైన వారు మధుర, పానిపట్ రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, దిగ్బోయి, బొంగైగావ్, పారాదీప్, గువాహటి, బరౌని, గుజరాత్, హల్దియా.. రిఫైనరీల్లో పనిచేయవల్సి ఉంటుంది..

వయస్సు..

అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా అక్టోబర్‌ 31, 2023వ తేదీ నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది..

అర్హతలు..

ట్రేడ్ పోస్టులకు.. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌/విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అటెండెంట్ ఆపరేటర్, ఫిట్టర్, మెకానికల్, సెక్రటేరియల్ అసిస్టెంట్, అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగాల్లో ఖాళీలున్నాయి..

టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు..

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌/విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీకాం, బీఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ విధానంలో నవంబర్ 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: అక్టోబర్ 21, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 20, 2023
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: నవంబర్ 2, 2023 నుంచి 27 వరకు
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 3, 2023
రాత పరీక్ష ఫలితాల వెల్లడి తేదీ: డిసెంబర్‌ 8, 2023
సర్టిఫికెట్ వెరిఫికేషన్ :డిసెంబర్ 13 నుంచి 21

ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే అధికార వెబ్ సైట్ ను బాగా పరిశీలించి అప్లై చెయ్యగలరు..

Exit mobile version