నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేవి లో ఉన్న పలు పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.. తాజాగా విశాఖ పరిధిలో నేవి లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు భారీగా ఉద్యోగాలను రిలీజ్ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం 275 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇండియన్ నేవీ ఆధ్వర్యంలోని విశాఖపట్నం డాక్యార్డ్ అప్రెంటీస్ స్కూల్ 275 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు…
మొత్తం ఖాళీల వివరాలు.. 275
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 36 పోస్టులు
ఫిట్టర్ – 33 పోస్టులు
షీట్ మెటల్ వర్కర్ – 33 పోస్టులు
కార్పెంటర్ – 27 పోస్టులు
మెకానిక్ (డీజిల్) – 23 పోస్టులు
పైప్ ఫిట్టర్ – 23 పోస్టులు
ఎలక్ట్రీషియన్ – 21 పోస్టులు
పెయింటర్ (జనరల్) – 16 పోస్టులు
R & A/C మెకానిక్ – 15 పోస్టులు
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) – 15 పోస్టులు
మెషినిస్ట్ – 12 పోస్టులు
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 10 పోస్టులు
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ – 5 పోస్టులు
అర్హతలు..
అభ్యర్థులు 10వ తరగతిలో 50% మార్కులతో, ఐటీఐ (NCVT/SCVT)లో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి..
వయోపరిమితి..
అభ్యర్థుల కనీస వయస్సు 14 ఏళ్లు ఉండాలి. కానీ ప్రమాదకరమైన ట్రేడులకు మాత్రం కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయస్సుపై ఎలాంటి పరిమితి లేదు..అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ముందుగా అధికారిక వెబ్సైట్ https://www.apprenticeshipindia.gov.in/ ఓపెన్ చేయాలి.
వెబ్సైట్లో మీ పేరుపై రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకోసం మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ అయిన తరువాత ముఖ్యమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
చివరిగా అన్ని వివరాలను సరిచూసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్ 18
దరఖాస్తుకు చివరి తేదీ : 2024 జనవరి 1
పరీక్ష తేదీ : 2024 ఫిబ్రవరి 28
రాత పరీక్ష ఫలితాలు – వెల్లడి తేదీ : 2024 మార్చి 2
ఇంటర్వ్యూ తేదీ : 2024 మార్చి 5-8
ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చే తేదీ : 2024 మార్చి 14
మెడికల్ ఎగ్జామ్ తేదీ : 2024 మార్చి 16..
మరిన్ని వివరాలకోసం అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు…