NTV Telugu Site icon

Indian Army Jobs: పది అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలు ఇవే..

Indian Army Jobs

Indian Army Jobs

కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సదరన్ కమాండ్‌లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ జారీ అయింది. ఈ రిక్రూట్‌మెంట్‌తోవాషర్‌మెన్, కుక్, గార్డెనర్, లేబర్ వంటి పోస్టులను మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద భర్తీ చేయనున్నారు.. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ www.hqscrecruitment.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ గడువు అక్టోబర్ 8న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 24 ఖాళీలు భర్తీ కానున్నాయి. నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను చూద్దాం..

మొత్తం ఖాళీలు..

ఎంటీఎస్ (మెసేంజర్)-13 పోస్టులు,
ఎంటీఎస్ (ఆఫీస్)- 3, కు
క్-2, వాషర్‌మెన్-2,
లేబరర్-3..

వయస్సు..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..

అర్హతలు..

దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం వర్క్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది. ముందు ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. రెండో దశలో ప్రాక్టికల్ ఎగ్జామ్/స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించనున్నారు..

జీతం..

ఎంటీఎస్ రిక్రూట్‌మెంట్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు వార్షిక వేతనం రూ.4.2 లక్షలు లభిస్తుంది. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా 41,822 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఓ నోటిఫికేషన్ జారీ చేశారు..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందు ఇండియన్ ఆర్మీ సదరన్ కమాండ్‌ అధికారిక పోర్టల్ www.hqscrecruitment.in ఓపెన్ చేయాలి.

హోమ్‌జీలోకి వెళ్లి ఎంటీఎస్ రిక్రూట్‌మెంట్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.

ఆ తరువాత ‘అప్లై నౌ’ ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా పేరు, ఫోన్ నంబర్ వంటి పర్సనల్ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

ఈ ప్రక్రియ ముగిసిన తరువాత రిజిస్టర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయాలి.

అర్హత ఉన్న పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి…
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే వాళ్లు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..