NTV Telugu Site icon

IDBI recruitment: ఐడీబీఐ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు..ఎవరు అప్లై చేసుకోవాలంటే?

Bank Jobsss

Bank Jobsss

బ్యాంకులో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ బ్యాంకులో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈమేరకు ఐడీబీఐ బ్యాంకులోస్పెషలిస్ట్ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. ఎలా అప్లై చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు..86

డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) (గ్రేడ్ D) – 1, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) – (గ్రేడ్ C) – 39, మేనేజర్ -(గ్రేడ్ B) – 46 (గ్రేడ్ D), 39 ఖాళీలు అసిస్టెంట్‌ పోస్టుల ఉన్నాయి. అలాగే.. జనరల్ మేనేజర్ (AGM) – (గ్రేడ్ C), మేనేజర్ -(గ్రేడ్ B) 46 ఉన్నాయి..

దరఖాస్తు చేసుకునే జరల్ అభ్యర్థులు రూ. 1000 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ క్యాటగీరికి చెందిన వారు దరఖాస్తు చేసుకుంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ (ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌) పోస్టులకు దరఖాస్తు చేసకునే వారు బీటెక్‌లో సంబంధిత స్ట్రీమింగ్‌లో డిగ్రీని పూర్తి చేయాలి.. అలాగే ఏడేళ్ల అనుభవం కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..

అర్హతలు..

ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే డిప్యూటీ జనరల్ మేనేజర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలి. ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ (అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 7 ఏళ్ల అనుభవం ఉండాలి..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

అనంతరం హోమ్‌ పేజీలో ఉండే కెరీర్‌ ట్యాప్‌పై క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత SO రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ క్రింద ఉన్న అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

ఇక అనంతరం రిజిస్టర్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి.

ఆ అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి. నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవాళ్లు వెబ్ సైట్ లో ఫుల్ డిటైల్స్ చూసుకొని అప్లై చేసుకోగలరు..