నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.. హైదరాబాద్ లోని ఇస్రోలో పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 54 టెక్నీషియన్ పోస్టుల భర్తీ చెయ్యనుంది.. అర్హతలు, దరఖాస్తు చివరి తేదీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
టెక్నీషియన్-బి (ఎలక్ట్రానిక్ మెకానిక్) పోస్టులు: 33
టెక్నీషియన్-బి (ఎలక్ట్రికల్) పోస్టులు: 8
టెక్నీషియన్-బి (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) పోస్టులు: 9
టెక్నీషియన్-బి (ఫొటోగ్రఫీ) పోస్టులు: 2
టెక్నీషియన్-బి (డెస్క్‌టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్) పోస్టులు: 2
పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిసెంబర్ 31, 2023 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపికైన అభ్యర్ధులు.. ఎన్‌ఆర్‌ఎస్సీ- ఎర్త్ స్టేషన్ (షాద్‌నగర్/ బాలానగర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-సెంట్రల్ (నాగ్‌పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నార్త్ (న్యూదిల్లీ), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-ఈస్ట్ (కోల్‌కతా), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్-వెస్ట్ (జోధ్‌పుర్), రీజినల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్- సౌత్ (బెంగళూరు) వీటిల్లో ఎక్కడైనా పని చెయ్యాల్సి ఉంటుంది..
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్లు ఆన్ లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 09, 2023వ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయి. డిసెంబర్ 31, 2023వ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. అప్లికేషన్ నింపే సమయంలో దరఖాస్తు రుసుము కింద రూ.600 లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకొనేందుకు అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..