NTV Telugu Site icon

ONGC Recruitment: ఓఎన్జీసీ లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.70 వేలకు పైగా జీతం?

Job Vacancy

Job Vacancy

నిరుద్యోగులు గుడ్ న్యూస్ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం.. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రముఖ ఆయిల్ కంపెనీ ఓఎన్జీసీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం జూన్ 19, 2024లోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

విద్యార్హతలు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

వయోపరిమితి..

ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 65 ఏళ్లు మించకూడదు.

వేతనం..

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.42,000 నుంచి రూ.70,000 వరకు వేతనం చెల్లిస్తారు..

ఎంపిక ప్రక్రియ..

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. రాత పరీక్షను ద్విభాషా పద్ధతిలో ఇంగ్లీష్, హిందీలో పెన్ అండ్ పేపర్ ఫార్మాట్‌లో నిర్వహిస్తారు..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ ONGC గుర్తింపు కార్డు (రెండు వైపులా) స్కాన్ చేసిన కాపీని అప్లికేషన్/బయో డేటా ఫారమ్‌తో పాటు సమర్పించవలసి ఉంటుంది.. ఆ తర్వాత హార్డ్ కాఫీని నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రెస్స్ కు పంపాలి..

ఈ పోస్టుల గురించి మరింత సమాచారం కోసం అధికార వెబ్ సైట్ ను సందర్శించాలి..