NTV Telugu Site icon

ESIC Recruitment 2023: పది అర్హతతో ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు.. 17,710 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Job Vacancy

Job Vacancy

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. దానికోసం దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 18వేల ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. ఇందుకు అప్లికేషన్ గడువు మరో పది రోజుల్లో ముగియనుంది.. ఈ ఉద్యోగాల అర్హతలను చూద్దాం..

పోస్టుల వివరాలు..

ఈఎస్‌ఐసీ ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 17,710 ఖాళీలను భర్తీ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, హెడ్ క్లర్క్/అసిస్టెంట్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/మేనేజర్ గ్రేట్ II/సూపర్‌ఇన్‌టెండెంట్ వంటి పోస్టులకు నియామక ప్రక్రియ జరగనుంది..

అర్హతలు..

గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదో తరగతి లేదా అందుకు సమానమైన కోర్సు పాసై ఉండాలి. అప్పర్, లోయర్, హెడ్ క్లర్క్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకు అయితే, అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి..

వయోపరిమితి..

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి..

ఎంపిక ప్రక్రియ..

పోస్టు ఆధారంగా ఎంపిక ప్రక్రియ వేర్వేరుగా ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, క్లర్క పోస్ట్‌లకు ప్రిలిమ్స్, మెయిన్స్, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్‌లకు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష ఉంటుంది..

జీతం..

ఒక్కో పోస్టుకు ఒక్కో జీతం ఉంది.. క్లర్క్‌కు జీతం నెలకు రూ.25,500 నుంచి రూ.81,100.. అప్పర్ డివిజన్ క్లర్క్‌కు రూ.19,900 నుంచి రూ.63,200.. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు రూ.18,000 – రూ.56,900, హెడ్ క్లర్క్ రూ.35,400- రూ.1,12,400, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ కు రూ.44,900-రూ.1,42,400 మధ్య ఉంటుంది..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందుగా ఈఎస్‌ఐసీ అధికారిక పోర్టల్ esic.nic.in ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీలోకి వెళ్లి, ‘రిక్రూట్‌మెంట్’ అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి.
ఆ తరువాత ESIC రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను పరిశీలించాలి.
అర్హతలు కలిగిన పోస్టులు అప్లై చేసుకోవాలి..
అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. అనంతరం అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి..

ఈ ఉద్యోగాలకు సంబందించిన మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ ను పరిశీలించగలరు..

Show comments