NTV Telugu Site icon

ECIL Recruitment 2024: ఈసీఐఎల్ లో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

Jobbss

Jobbss

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రముఖ కంపెనీ ఈసీఐఎల్ లో భారీగా ఉద్యోగులను భర్తీ చేసేందుకు పలు పోస్టులకు దరఖాస్తులను కోరుతుంది.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 16. ఆసక్తి గల అభ్యర్థులు ఈసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్ www.ecil.co.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

పోస్టుల వివరాలు..

ఈసీఐఎల్ మొత్తం 1100 కాంట్రాక్ట్ (గ్రేడ్ II) జూనియర్ టెక్నీషియన్‌ పోస్ట్ లను భర్తీ చేయనుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. అభ్యర్థి ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ ట్రేడ్‌లలో ITI (2 సంవత్సరాలు) ఉత్తీర్ణులై ఉండాలి.. కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

అప్లికేషన్ ఫామ్స్ ను పరిశీలించి, అర్హులైన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తరువాత, వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందుగా ఈసీఐఎల్ అధికారిక వెబ్‌సైట్‌ www.ecil.co.in ను సందర్శించండి.
హోమ్‌పేజీలో, కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
తర్వాత , “Click here to apply for the JTC (Grade-II) Posts.” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
స్క్రీన్‌పై అప్లికేషన్ ఫామ్ ఉన్న కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి.
ఫామ్‌ను సబ్మిట్ చేయండి…
ఆ తర్వాత ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి..