E-Pathshala For All: ‘ఇ-పాఠశాల’ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీఈఆర్‌టీ) ప్రవేశపెట్టింది. ఇది అందరి వేదిక. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, టీచర్ ఎడ్యుకేటర్స్, పాలసీ ప్లానర్స్, సామాన్యులు, ప్లేయర్స్.. ఇలా ప్రతిఒక్కరికీ అవసరమైన డిజిటల్, డిజిటైజబుల్ వనరులు ఈ ప్లాట్‌ఫాంలో దొరుకుతాయి. ఇక్కడ నాణ్యమైన విద్య లభిస్తోంది. ‘ఎన్‌సీఈఆర్‌టీ అఫిషియల్’ నిర్వహిస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్‌లో దాదాపు వందల వీడియోలు ఉన్నాయి. ఇవి పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వర్గాలవారూ చూడదగ్గవే కావటం ఆసక్తికరం.
విభిన్న అంశాలపై పలువురు నిపుణుల విలువైన అభిప్రాయలను వినొచ్చు. ఎడ్యుకేట్ అవ్వొచ్చు. ‘ఇ-పాఠశాల’ నిజంగా ఒక డిజిటల్ లైబ్రరీ అని చెప్పొచ్చు. ఇందులో పర్సనాలిటీ డెవలప్మెంట్స్, లైవ్ ఇంటరాక్షన్స్, సెల్ఫ్ డిసిప్లెయిన్, సైకలాజికల్ ఫ్లెక్సిబిలిటీ, వయసు మీద పడ్డప్పుడు వచ్చే ప్రత్యేక అవసరాలు, సమస్యలు, స్వాతంత్ర్య పోరాటం, ఇ-పేమెంట్స్, ప్రీపెయిడ్ కార్డ్స్, మైక్రో ఏటీఎంలు.. ఇలా డిఫరెంట్ టాపిక్స్‌పైన రూపొందించిన వీడియోలు చూసి ఎంతో నేర్చుకోవచ్చు. ఉదాహరణకు ఒక లింక్‌ని ఈ కింద ఇస్తున్నాం. దాని ఆధారంగా ‘ఇ-పాఠశాల’లోకి వెళ్లి నిత్య విద్యా్ర్థిలా మారతారని ఆశిస్తూ..