Site icon NTV Telugu

CUET UG 2025: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..

Nta

Nta

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2025 ఫలితాలను ప్రకటించింది. ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.inలో విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంట్రీ చేసి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాల యూజీ కోర్సులలో ప్రవేశం పొందుతారు.

READ MORE: MLA Payal Shankar: ప్రజలను కాంగ్రెస్ చేసినంత మోసం ఏ పార్టీ మోసం చేయలేదు..

స్కోర్‌కార్డ్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

 

కాగా.. ఈ పరీక్షను మే 13 నుంచి జూన్ 4 వరకు దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సారి13,54,699 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ తాత్కాలిక కీని జూన్ 17న విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను తెలియజేయడానికి జూన్ 20 వరకు సమయం ఇచ్చింది. దానిపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి.. జూలై 1న తుది కీని విడుదల చేసింది. తాజాగా పూర్తి ఫలితాలను విడుదల చేసింది.

READ MORE: Pawan Kalyan: నాకు ఇంటర్ సీట్ ఆయనే ఇప్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన పవన్!

 

 

Exit mobile version