కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపకబురు చెప్పింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.. తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ప్రకారం 74 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 31, 2023 అంటే ఈరోజు దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు ఇదే సాయంత్రం ఐదు లోపల వీటికి అప్లై చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్ట్ సమాచారం, అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం.. అప్పుడే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం సులువు అవుతుంది.. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
కన్సల్టెంట్ A- 19
కన్సల్టెంట్ B-52
కన్సల్టెంట్ C-3
మొత్తం పోస్ట్ 74
జీతం..
ఒక్కో పోస్టుకు ఒక్కో విధమైన అర్హతలు ఉన్నాయి.. అదే విధంగా ఒక్కో జీవితం కూడా ఉంది పోస్టుల వారీగా జీతాన్ని చూస్తే..
కన్సల్టెంట్ A- నెలకు రూ. 60,000
కన్సల్టెంట్ B- నెలకు రూ. 80,000
కన్సల్టెంట్ సి- నెలకు రూ. 1,00,000
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష
ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుము..
అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉద్యోగము చేయవలసిన ప్రదేశం
భారతదేశంలో ఎక్కడైనా ఉద్యోగం చెయ్యాల్సి ఉంటుంది..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రారంభ తేదీ: 20/09/2023
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: అక్టోబర్ 31, 2023 (ఈరోజు)..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈరోజే చివరి రోజూ.. అస్సలు మర్చిపోకండి.. వెంటనే అప్లై చేసుకోండి..