నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగం చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. బ్యాంక్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.inలో గడువు తేదీ జనవరి 9 లోగా అప్లై చేసుకోవాలి.. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.. ఆ తర్వాత రెండో వారంలో పరీక్షలు నిర్వహిస్తారు..
అర్హతలు :
ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి ఏదై నా విభాగంలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి.. MS Office, ఈమెయిల్, ఇంటర్నెట్ స్కిల్స్ వంటి కంప్యూటర్ స్కిల్స్ అవసరం.. అప్పుడే ఇంటర్వ్యూ లో ప్రాధాన్యత ఉంటుంది..
మొత్తం ఖాళీలు..
484 జోన్ల వారీగా ఖాళీలు: అహ్మదాబాద్-76, భోపాల్-38, ఢిల్లీ-76, కోల్‌కతా-02, లక్నో-78, ఎంఎంజెడ్‌వో-పుణె-118, పాట్నా-96..
వయసు..
31.03.2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీతం..
నెలకు రూ.14,500 నుంచి రూ.28,145 వరకూ ఉంటుంది.
ఎంపిక విధానం..
ఆన్‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు..
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.01.2024
వెబ్‌సైట్: https://centralbankofindia.co.in అభ్యర్థులు సందేహాల కోసం ఈ సైట్ లో పరిశీలించగలరు..