NTV Telugu Site icon

BHEL Jobs 2024 : ఎటువంటి రాత పరీక్ష లేకుండానే BHEL భారీగా ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

Bhel

Bhel

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ సంస్థ BHEL లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 33 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు మార్చి 31 లోపు అప్లై చేసుకోవాలి.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం పోస్టులు.. 33

పోస్టుల వివరాలు..

సీనియర్ ఇంజనీర్ – 19 పోస్టులు

డిప్యూటీ మేనేజర్ – 10 పోస్టులు

సీనియర్ మేనేజర్- 04 పోస్టులు

అర్హతలు..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనేవారు ఒక్కో పోస్టుకు ఒక్కో అర్హతలను కలిగి ఉంటుంది. సంబందించిన డిగ్రీని కలిగి ఉండాలి.. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడవచ్చు..

దరఖాస్తు ఫీజు..

UR/EWS/OBC అభ్యర్థులు రూ. 472 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. SC/ST/PWD/Ex-Servicemen కేటగిరీకి చెందిన వారు దరఖాస్తు అన్ని కలిపి 472 రూపాయలు ఫీజు చెల్లించాలి..

ఎంపిక ప్రక్రియ..

ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు..

జీతం..

ఒక్కో పోస్టుకు ఒక్కో జీతం ఉంటుంది.. దాదాపు అన్ని పోస్టులకు రూ.2 లక్షల వరకు జీతం ఉంటుంది..

ఈ పోస్టులకు అప్లై చేసుకోవారు అధికార వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..