NTV Telugu Site icon

BEL Jobs 2024: బెల్ లో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు, పూర్తి వివరాలివే..

Bel Jobss

Bel Jobss

ప్రభుత్వం వరుసగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిన్స్‌ లిమిటెడ్‌ (బెల్‌)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ద్వారా 22 ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఇంజనీరింగ్ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 12, 2024. ఆ లోపు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

మొత్తం పోస్టుల సంఖ్య : 22

అర్హతలు..

సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి..

వయసు: 32 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌కు రూ.40,000 నుంచి రూ.55,000, ట్రైనీ ఇంజనీర్‌కు రూ.30,000 నుంచి రూ.40,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.02.2024.

వెబ్‌సైట్‌: https://bel-india.in/ లో ఈ పోస్టుల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు..