NTV Telugu Site icon

Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. జీతం రూ.2 లక్షలు..పూర్తి వివరాలు..

Jobs

Jobs

ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్… కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ ప్రకారం 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ద్వారా వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఇక ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఇండియన్ ఆర్మీ అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్ https://joinindianarmy.nic.in/ ద్వారా అక్టోబర్ 26లోపు అప్లై చేసుకోవాలి..

మొత్తం ఖాళీలు..

కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్ కేటగిరీల్లో 7 చొప్పున పోస్టులు భర్తీ కానున్నాయి. ఎలక్ట్రికల్ -3, ఎలక్ట్రానిక్స్- 4, ఆర్కిటెక్చర్-2..

అర్హతలు..

దరఖాస్తు చేసుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వయసు 2024 జులై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవాలి..

ఇంటర్వ్యూ ప్రక్రియ..

ఇంటర్వ్యూ, ఇంజనీరింగ్ కోర్సుల్లో సాధించిన మార్కులు కీలకం కానున్నాయి. ఈ రెండు అంశాల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు..

జీతం..

ఈ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.56,000 నుంచి రూ.2,50,000 మధ్య లభిస్తుంది. ఇతర అలవెన్స్ ప్రయోజనాలు పొందనున్నారు.

ఎలా అప్లై చేసుకోవాలంటే?

ముందు ఇండియన్ ఆర్మీ అధికారిక పోర్టల్ https://joinindianarmy.nic.in/ ఓపెన్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి హోమ్‌పేజీలోకి వెళ్లాలి.

139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(TGC) రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి అన్ని అంశాలను పరిశీలించాలి.

ఇక ‘అప్లై నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా పేరు, ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

రిజిస్ట్రర్ ఐడీతో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ నింపాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా ఫారమ్ సబ్‌మిట్ చేయాలి..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవాళ్ళు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..