Site icon NTV Telugu

AP Sankranthi Holidays 2024:ఏపీలో సంక్రాంతి పండగకు మొత్తం ఎన్ని రోజులు సెలవులంటే ..?

Sankranthi

Sankranthi

2023 డిసెంబర్ నెలతో ముగుస్తుంది.. జనవరి 2024 తో కొత్త ఏడాది మొదలవుతుంది.. వచ్చే ఏడాదిలో మొదటి నెలలోనే భారీగా సెలవులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.. ఎవరికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే.. ఈసారి సంక్రాంతి సెలవులు నాలుగు, ఆరు రోజులు ఉన్నట్లు తెలుస్తున్నాయి.. జనవరిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

జనవరి 13 రెండో శనివారం..జనవరి 14వ తేదీన భోగి పండగ.. ఆదివారం వచ్చింది. జనవరి 15వ తేదీన సంక్రాంతి పండగ.. సాధారణంగా సెలవులు ఉంటుంది. అలాగే జనవరి 16వ తేదీన ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. దీంతో పాటు స్కూల్స్‌, కాలేజీలకు మరో రెండు రోజులు పాటు అదనం సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.. దాంతో మొత్తం ఆరు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది..ఇంకా ఈ ఈనెల నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారం కలిపితే బోలెడు సెలవులు ఈ నెలలో రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా చూస్తే 2024 జనవరి నెలలో దాదాపు 11 నుంచి 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి…

వచ్చే ఏడాదిలో సెలవులు బాగానే ఉన్నాయి.. ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో చూద్దాం..

15-01-2024న (సోమవారం) సంక్రాంతి
16-01-2024న (మంగళవారం) కనుమ
26-01-2024 (శుక్రవారం) రిపబ్లిక్ డే
08-03-2024 (శుక్రవారం) మహాశివరాత్రి
25-03-2024 (సోమవారం) హోలీ
29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్‌ జయంతి)
09-04-2024 (మంగళవారం) ఉగాది
11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
17-06-2024 (సోమవారం) బక్రీద్
17-07-2024 (బుధవారం) మొహర్రం
15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
07-09-2024 (శనివారం) వినాయకచవితి
16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
31-10-2024 (గురువారం) దీపావళి
25-12-2024 (బుధవారం) క్రిస్మస్ పండుగ.. ఏడాది మొత్తం సెలవుల లిస్ట్ ఇదే..

Exit mobile version