నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల వరుసగా ఉద్యోగాల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా మరోసారి ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రోడ్డు, భవనాల శాఖ.. కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు కోరుతోంది.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాల ను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు..
వాచ్‌మెన్: 6 పోస్టులు
శానిటరీ వర్కర్లు: 8 పోస్టులు
ఆఫీస్ సబ్‌ఆర్డినేట్స్: 10 పోస్టులు
అర్హతలు..
పదో తరగతి లో ఉత్తీర్ణత అయిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు..
వేతనం..
నెలకు రూ. 15000/- ఆ తర్వాత ఇంక్రిమెంట్ లు ఉంటాయాని చెబుతున్నారు..
ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సూపరింటెండింగ్ ఇంజనీర్ (R&B) సర్కిల్ కార్యాలయం, కడప, మారుతీ నగర్, వైఎస్సార్ జిల్లా చిరునామ కు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 22, 2024.. ఈ ఉద్యోగాలు గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే అధికార వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు..