Site icon NTV Telugu

AAICLAS Recruitment : ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 436 పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

Aai Jobs

Aai Jobs

ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ఎఎఐ మరో నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 436 అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టులను మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేస్తారు.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు..

ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సామాన విద్యార్హత ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషలో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 27 సంవత్సరాలకు మించకూడదు. ఎంపికైన వారు చెన్నై, కోల్‌కతా, గోవా, కోజికోడ్, వారణాసి, శ్రీనగర్, వడోదర, తిరుపతి, వైజాగ్, మధురై, తిరుచ్చి, రాయ్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, పోర్ట్ బ్లెయిర్, అగర్తల, గ్వాలియర్, అమృత్‌సర్, లేహ్, డెహ్రాడూన్, పుణె, ఇండోర్, సూరత్ లలో పనిచేయాల్సి ఉంటుంది.. ఎక్కడ వస్తే అక్కడకు వెళ్ళాల్సిందే..

ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జీత భత్యాలు నెలకు రూ.21,500 నుంచి రూ.22,500. చెల్లిస్తారు. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, మహిళా అభ్యర్థులకు రూ.100. చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 15.11.2023.గా నిర్ణయించారు. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకొందుకు వెబ్ సైట్ ; https://aaiclas.aero పరిశీలించగలరు… ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనేవారు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..

Exit mobile version