Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Education 85 Students Of Iit Bombay Who Have Shown Their Potential Have Earned More Than One Crore Salary

IIT Bombay: సత్తా చాటిన ఐఐటీ బాంబే విద్యార్ధులు.. 85 మందికి కోటికి పైగా వేతనం..

Published Date :January 5, 2024 , 2:43 pm
By Venu Goapl Reddy
IIT Bombay: సత్తా చాటిన ఐఐటీ బాంబే విద్యార్ధులు.. 85 మందికి కోటికి పైగా వేతనం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

IIT Bombay: దేశంలో ఐఐటీ అంటే మామూలు క్రేజ్ ఉండదు. ఐఐటీలో చదివిన విద్యార్థులకు దేశంలోనే కాదు ప్రపంచస్థాయిలో తీవ్రమైన డిమాండ్ ఉంది. ఈ విద్యాసంస్థల నుంచి వచ్చిన విద్యార్థులను తమ ఉద్యోగంలో చేర్చుకోవాలని మల్టీ నేషనల్ కంపెనీలు ఉవ్విళ్లూరుతుంటాయి. తాజాగా మరోసారి ఐఐటీ సత్తా నిరూపితమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే(IIT Bambay) విద్యార్థులను జాక్‌పాట్ వరించింది. 85 మంది విద్యార్థులు రూ. కోటికి పైగా వార్షిక వేతనంతో ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. 2023-24 నియామకాల్లో సీజన్ ఫేజ్-1లో భాగంగా ఈ సాలరీ ప్యాకేజీని అందుకోనున్నారు.

ఐఐటీ బాంబే ఇటవల నిర్వహించిన క్యాంపస్ నియామక ప్రక్రియలో దేశవిదేశాలకు చెందిన 388 కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 1340 మంది విద్యార్థులు హాజరవ్వగా.. 1188 మంది విద్యార్థులు ఉద్యోగాలను సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలైన గూగుల్, యాపిల్, ఎయిర్‌బస్, యాక్సెంచర్, జేపీ మోర్గాన్ చేజ్, మైక్రోసాఫ్ట్, టాటా గ్రూప్ వంటి వాటిలో ఉద్యోగాలు పొందారు కొన్ని సంస్థలు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. మరికొన్ని వర్చువల్‌గా నియామక ప్రక్రియలో పాల్గొన్నాయి.

Read Also: World’s worst Rated Food: ప్రపంచంలోనే అత్యంత చెత్త ఆహారం ఏంటో తెలుసా?

ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో జాబ్స్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో ఐటీ-సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్/ బ్యాంకింగ్/ఫిన్ టెక్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్ వంటి విభాగాలు ఉన్నాయి. మనదేశంలో పాటు జపాన్, తైవాన్, సౌత్ కొరియా, నెదర్లాండ్స్, సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో పనిచేసేందుకు 63 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీని చూస్తే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్లకు రూ. 21.88 లక్షలుగా ఉంటే, ఐటీ విద్యార్థులకు రూ. 26.30 లక్షలు, ఫైనాన్స్ లో రూ. 32.38 లక్షలు, కన్సల్టింగ్ రూ. 18.68 లక్షలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రూ. 36.94 లక్షల చొప్పున వేతన ప్యాకేజీని అందుకోనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IIT BOMBAY
  • indian institute of technology bombay
  • IT
  • salary package

తాజావార్తలు

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  • CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..

  • Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions