NTV Telugu Site icon

The National Testing Agency (NTA): విడుదలైన 2024 NEET, JEE మెయిన్ పరీక్ష తేదీలు..

Untitled 4

Untitled 4

Education: The National Testing Agency (NTA): విద్యారంగంలో తన ప్రతిభని చాటుకోవాలని డాక్టర్ గా ప్రజలకి సేవలందించాలని ఆశపడే విద్యార్థుల కోసం NEET UG ప్రవేశ పరీక్షను మరియు ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్ధులకి JEE మెయిన్స్ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతి అంవత్సరం నిర్వహిస్తుంది. ఈ పరీక్ష లో ఉతీర్ణులైన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కళాశాలల్లో చదువుకునేందు అవకాశం లభిస్తుంది. ఎప్పటిలానే రాబోయే 2024 -2025 అకడమిక్ సెషన్ కోసం NTA సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE మెయిన్)-2024 సెషన్ 1, సెషన్ 2 మరియు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (NEET) UG పరీక్ష తేదీలను ప్రకటించింది.

Read also: CUET UG 2024: విద్యార్ధులకి తాజా వార్త.. 2024 CUET UG ,PG పరీక్ష తేదీలు విడుదల

JEE ప్రధాన సెషన్ 1 2024 జనవరి 24వ తేది నుండి ఫిబ్రవరి 1వ తారీకుల మధ్య నిర్వహించనున్నారు. కాగా సెషన్ 2 2024 ఏప్రిల్ 1, నుండి ఏప్రిల్ 15 మధ్య నిర్వహించబడుతుంది. అలానే NEET UG ప్రవేశ పరీక్ష 2024 మే 5 వ తేదీన జరగనుంది. వీటితో పాటుగా NET ప్రరీక్ష తేదీలను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. NET జూన్ 10 నుండి 21 వరకు నిర్వహించబడనుంది. దేశంలోని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో ‘జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్’గా అవకాశం సాధించాలి అనుకునే అభ్యర్థుల అర్హతను అంచనా వేయడానికి UGC NET పరీక్ష నిర్వహించబడుతుంది. కాగా JEE మెయిన్స్ మరియు NEET యూజీ పరీక్షలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. NET సంవత్సరానికి రెండుసార్లు అనగా జూన్ మరియు డిసెంబర్ నెలల్లో నిర్వహించబడుతుంది

Show comments