NTV Telugu Site icon

Mahabubabad: విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ది చేసిన కుటుంబ సభ్యులు..

Mahabubabad

Mahabubabad

Mahabubabad: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వార్డెన్ కు దేహశుద్ధి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాదెరుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్ లో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని ఆ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటుంది. ఇటీవల వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థి ఇంటికి వెళ్లి వార్డెన్ అబ్రహం మొబైల్ ఫోన్ కు హాయ్ అంటూ మెసేజ్ చేసింది. ఇద్దరూ ఫోన్‌లో చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో వార్డెన్.. విద్యార్థినికి ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పంపాడు. ఈ విషయాన్ని విద్యార్థిని తన తండ్రికి తెలిపింది. దీంతో ఈ విషయాన్ని విద్యార్థి తండ్రి బుధవారం పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోనే వార్డెన్ కనిపించడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానిక పాఠశాల ఆవరణలోనే వార్డెన్‌ను కొట్టడంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అతడిని తొలగించాలని కోరారు. విద్యార్థిని బంధువులు ఒక్కసారిగా అతడిపై దాడి చేయడంతో ప్రిన్సిపాల్.. వార్డెన్ ను ఆఫీసు గదిలో బంధించాడు. ఈ విషయంలో స్కూల్ యాజమాన్యం తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పుచేసిన వార్డెన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు వాపోయారు. పిల్లలపై ఇలా అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపిన ప్రిన్సిల్ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. వార్డెన్ ను తొలగించకుండా.. అతనిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.

Harish Rao: రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ.. ముఖ్యాంశాలు ఇవే..

Show comments