Site icon NTV Telugu

Tragedy : ఇది చాలా ఘోరం.. అత్త శ్రద్ధాంజలి బ్యానర్‌తో వస్తూ అల్లుడు మృతి

Accident

Accident

Tragedy : వికారాబాద్ జిల్లాలోని ఫుల్మద్ది గ్రామంలో ఒకే రోజు రెండు విషాదాలు చోటు చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అత్త మరణంతో శ్రద్ధాంజలి బ్యానర్‌ను తీసుకుని వెళ్తున్న అల్లుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఒకే కుటుంబంలో రెండు మరణాలు సంభవించడంతో స్థానికులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఫుల్మద్ది గ్రామానికి చెందిన లక్ష్మి మృతి చెందారు. ఆమె మరణ వార్త తెలిసిన అల్లుడు శ్రీనివాస్, అంత్యక్రియల కోసం వికారాబాద్ పట్టణానికి వచ్చి ఆమె శ్రద్ధాంజలి బ్యానర్‌ను ముద్రించుకున్నాడు. బ్యానర్‌ను తీసుకుని తిరిగి ఫుల్మద్ది గ్రామానికి తన బైక్‌పై వెళ్తుండగా, మార్గమధ్యలో రోడ్డుపై ఉన్న గుంతతో బైక్ అదుపు తప్పి కిందపడిపోయాడు.

UP: పదే పదే కరిచే వీధి కుక్కలకు “జీవిత ఖైదు”..యూపీ సర్కార్ నిర్ణయం..

అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఒక డీసీఎం వాహనం శ్రీనివాస్ మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన చూసిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. శ్రద్ధాంజలి బ్యానర్‌ను మృతుడైన శ్రీనివాస్ మృతదేహంపై కప్పిన దృశ్యం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఒకే రోజు అత్త, అల్లుడు మరణించడంతో రెండు కుటుంబాలు తీరని దుఃఖంలో మునిగిపోయాయి. ఈ విషాద ఘటన ఫుల్మద్ది గ్రామాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Little Hearts Jai Krishna : టాలీవుడ్ కు కొత్త కమెడియన్ వచ్చాడోచ్..

Exit mobile version