NTV Telugu Site icon

Vikarabad Sireesha Case: వీడిన శిరీష హత్య కేసు మిస్టరీ.. వెలుగులోకి సంచలన విషయాలు

Sireesha Death Mystery

Sireesha Death Mystery

Vikarabad Sireesha Death Case Mystery Revealed: సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసు మిస్టరీ వీడింది. శిరీష అక్కడ శ్రీలత భర్త అనిల్ ఆమెను దారుణంగా హతమార్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. అనిల్, శిరీష మధ్య కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కూడా ఉందని తేలింది. తొలుత శనివారం రాత్రి ఫోన్ ఎక్కువగా వాడుతున్నావ్ అంటూ శిరీషను ఆమె అన్నయ్య తిట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటికొచ్చిన బావ అనిల్ కూడా శిరీషను కొట్టాడు. దీంతో ఆమె మనస్థాపం చెందింది. అప్పుడు అర్థరాత్రి కలుద్దామని చెప్పి, శిరీషను అనిల్ బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత.. శిరీష తలుపుని బయట నుంచి గడియపెట్టి వచ్చేసింది. ఇద్దరు కలుసుకున్న తర్వాత.. వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో.. శిరీషపై అనిల్ అత్యాచారం చేసి, ఆమె గొంతు కోసి చంపేశాడు.

Love Jihad : బెంగళూరులో మరో లవ్ జిహాద్ కేసు.. పోలీసులను ఆశ్రయించిన యువతి

ఈ కేసులో పోలీసులకు మొదటి నుంచే అనిల్‌పై అనుమానం ఉంది. శనివారం రాత్రి ఇంట్లో గొడవ జరగడం, అనిల్ ఆమెపై చెయ్యి చేసుకోవడం సంగతి తెలిసి.. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆపై శిరీష ఫోన్‌ను పరిశీలించగా.. అందులో అనిల్ పేరుని డార్లింగ్‌గా ఆమె సేవ్ చేసుకోవడాన్ని గమనించారు. దీంతో.. అతడిపై అనుమానంతో ప్రశ్నించారు. అనిల్ పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో.. తమదైన శైలిలో అడిగారు. దాంతో.. అతడు నిజం మొత్తం కక్కేశాడు. శిరీషను అత్యంత ఆటవికంగా, క్రూరంగా చంపింది బావేనని పోలీసులు తేల్చేశారు. కాగా.. శిరీష గొంతును బ్లేడుతో కోసి చంపేసిన అనిల్, స్క్రూడ్రైవర్‌తో కళ్లను చిద్రం చేసి, ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న నీటిగుంటలో పడేశాడు.

Cm Jagan: ఏపీలో నేడే జగనన్న విద్యాకానుక.. ప్రారంభించనున్న సీఎం జగన్..

Show comments