Site icon NTV Telugu

Tragedy : అప్పు తిరిగివ్వమన్నందుకు.. మద్యం తాగించి కత్తితో పొడిచి..

Tragedy : వికారాబాద్ జిల్లాలో అప్పు తగాదా హత్యకు దారితీసింది. పెద్దేముల్ మండలంలోని మాన్‌సన్పల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. చిన్న మొత్తపు అప్పు వివాదం రక్తపాతం వరకు వెళ్లింది. ఫామ్‌హౌస్‌లో కూలీలుగా పనిచేసిన ఇద్దరు మాన్‌సన్పల్లి సమీపంలోని ఒక వ్యవసాయ ఫామ్ హౌస్‌లో మూడవత్ రవి (39), బాలాజీ అనే వ్యక్తులు కూలీలుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారు. కొంతకాలం క్రితం బాలాజీకి రవి రూ.2,050 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తిరిగి ఇవ్వమని రవి పదేపదే కోరడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.

Wines Tender : మద్యం షాపుల కోసం మహిళల పోటీ.. ఒకే మహిళ 150 షాపులకు దరఖాస్తు..

2023లో ఒకరోజు రాత్రి బాలాజీ, రవిని మద్యం తాగడానికి పిలిచాడు. ఫామ్‌హౌస్‌లో మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటున్న సమయంలో రవి అప్పు గురించి మళ్లీ ప్రస్తావించాడు. దీనిపై కోపం తెచ్చుకున్న బాలాజీ, రవిని కడుపులో కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

తీవ్రంగా గాయపడిన రవిని సహచరులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ కొద్ది రోజులకే రవి మృతి చెందాడు. ఈ ఘటనపై పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీర్ఘకాల విచారణ అనంతరం పోలీసులు నిందితుడు బాలాజీని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాండూర్ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Redmi K90 Pro Max: రెడ్‌మి కె 90 ప్రో మాక్స్ డిజైన్ అదిరింది.. పవర్ ఫుల్ ఫీచర్లతో వచ్చేస్తోంది

Exit mobile version