S*exual Assault: పిల్లల స్మార్ట్‌ఫోన్ వినియోగం, సోషల్ మీడియా ఖాతాలపై తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఏర్పడే పరిచయాలు ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి. అయితే, ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలని పేర్కొంటున్నారు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన రాహుల్ అనే యువకుడు, ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థినిని నమ్మించి.. ఆ తర్వాత విజయవాడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Hyderabad: ప్రేమ పేరుతో అమ్మాయిలకు వల.. కట్‌చేస్తే
అలాగే, మంగళగిరి పరిధిలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి నలుగురు యువకులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటన అనంతరం ఈ విషయం బయటకు చెబితే చంపేస్తాని నిందితులు బాలికను బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణ భయంతో బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ఇక, బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రశ్నించగా, జరిగిన విషయం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
