Site icon NTV Telugu

Viral Video: మీరెక్కడి మనుషులురా బాబు.. తినే తిండి మీద ఊయడమేంట్రా..

Untitled Design (2)

Untitled Design (2)

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో ఒక అవమానకరమైన, అమానవీయ సంఘటన జరిగింది. మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా పిలుస్తుంటాం. ఓ రెస్టారెంట్ ఉద్యోగి తినే ఫుడ్ లో ఉమ్మేసాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్థానిక రెస్టారెంట్‌లో తందూరీ రోటీపై ఒక వ్యక్తి ఉమ్మి వేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో వీడియో కనిపించడంతో హిందూ సంస్థలు గురువారం ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించాయి.

Read Also: Types of Anesthesia: అసలు అనస్థీషియా ఎందుకు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారో మీకు తెలుసా?

విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ కార్యకర్తలు ప్రధాన మార్కెట్ ప్రాంతంలో గుమిగూడి, హనుమాన్ చౌక్ వద్ద వ్యాపారాలను మూసివేసి నినాదాలు చేశారు. జవాబుదారీతనం న్యాయం కోరుతూ అనేక మంది స్థానిక హిందూ వ్యాపారులు నిరసనలో పాల్గొన్నారు. “జైకా రెస్టారెంట్” ఉద్యోగి వెన్న నాన్ బ్రెడ్ మీద ఉమ్మి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన వేగంగా వ్యాప్తి చెందడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, హిందూ సంఘాల్లో ఆగ్రహాజ్వాలలు వ్యక్తమువుతున్నాయి. ఈ సంఘటనను “ఉమ్మి జిహాద్” అని భావిస్తూ, హిందూ సామ్రాట్ దర్శన్ భారతి, విశ్వ హిందూ బజరంగ్ దళ్, ఇతర మత సంస్థలు దీనిని పవిత్ర భూమి గుర్తింపుపై దాడిగా అభివర్ణించాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

“దేవభూమి ఉత్తరాఖండ్ మతం, విశ్వాసం, స్వచ్ఛతతో గుర్తించడం జరిగిందన్నారు హిందూ చక్రవర్తి దర్శన్ భారతి. ఈ భూమి గౌరవాన్ని దెబ్బతీసే వారు జిహాదీ మనస్తత్వాన్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అధికారులు అటువంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించవలసి వస్తుందన్నారు. దోషులపై NSA కింద అభియోగాలు మోపాలని, జైకా రెస్టారెంట్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని హిందూ చక్రవర్తి దర్శన్ భారతి డిమాండ్ చేశారు.”

Read Also:Slaps Biker: సార్ మీరు.. రక్షక భటులా.. భక్షక భటులా..

ఈ విషయంపై వెంటనే స్పందించామని ఇన్‌స్పెక్టర్-ఇన్-చార్జ్ భావన కంథోలా తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే రెస్టారెంట్ ఉద్యోగిని విచారణ చేసామన్నారు. విచారణ తర్వాత అతన్ని విడుదల చేశారు. అయితే అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. “ఈ సంఘటనపై తీవ్రం దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ జనక్ సింగ్ పవార్ తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జైకా రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చర్యలు చేపట్టింది. ఈ దారుణమైన చర్యను సామాజిక నేరంగా పరిగణించి, నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక పౌరులు, మత సంస్థలు జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్‌ను డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు.

Exit mobile version