స్కూల్ విద్యార్థినితో ఓ కీచక టీచర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పరీక్షిత్ గఢ్ లో ఒక అసిస్టెంట్ టీచర్ 7వ తరగతి విద్యార్థినిని ఓయో రూమ్ కు రావాలని బెదిరించాడు. దీంతో ఆ విద్యార్థిని ఆ టీచర్ పై కుటుంబ సభ్యులకు తెలిపింది. అనంతరం వారు టీచర్ పై పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
ఆ కీచక టీచర్ అనురాగ్ పై పోలీసులు పోక్సో చట్టం, బెదిరింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం కళాశాల యాజమాన్యం అతడిని రెండు నెలల పాటు సస్పెండ్ చేసింది.
వివరాల్లోకి వెళితే… యూపీలోని పరీక్షిత్ పట్టణంలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినికి అసిస్టెంట్ టీచర్ అనురాగ్ ఫోన్ చేసి ఓయో హోటల్‌కు రూం రావాలని చెప్పాడని.. ఒక వేళ రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు ఆమె తెలిపింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. శనివారం రోజున అతడిని కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు. ఆడవారిపై, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
