ఉత్తర ప్రదేశ్ మధురలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తను ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో మనస్తాపం చెందిన ఒక ఫోటోగ్రాఫర్ తన దుకాణంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ నోట్‌లో తన మరణానికి అమ్మాయి కుటుంబమే కారణమని పేర్కొన్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే…రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా లాలా వాలి గలి మెయిన్ బజార్‌లో నివసిస్తున్న ధర్మేంద్ర, తన మేనల్లుడు ఉదిత్ (25) శ్రీ కృష్ణ జన్మస్థాన్ సమీపంలోని పోట్రా కుండ్ దగ్గరలో VK ఫిల్మ్ ప్రొడక్షన్ అనే ఫోటో షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. అతను ప్రతి వారం ఇంటికి వచ్చేవాడని. గత రెండు సంవత్సరాలుగా తన మేనల్లుడు చౌక్ బజార్‌కు చెందిన ఒక అమ్మాయిని ప్రేమించినట్లు వెల్లడించాడు ధర్మేంద్ర. అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు. రెండు రోజుల క్రితం, అతను మొబైల్ ఫోన్ విషయంలో ఆ అమ్మాయితో గొడవ పడ్డాడని చెప్పుకొచ్చారు. ఈ వివాదంతో ఆ అమ్మాయి ఉదిత్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. బాధితురాలి ఫిర్యాదు మేరకు, ఉదిత్‌పై చలాన్ దాఖలు చేసినట్లు తెలిపారు.. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియగానే, వారు ఉదిత్‌ను తమతో ఇంటికి తీసుకెళ్లారన్నారు ధర్మేంద్ర..
గల్తేశ్వర్ మహాదేవ్ దీపం వెలిగించే పేరుతో ఉదిత్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ యువకుడు చాలా సేపటి వరకు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది అతని మొబైల్‌కు కాల్ చేయడం ప్రారంభించారు. ఆ యువకుడి తండ్రి చాలాసార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో… పక్కనే ఉన్న టీ షాప్ యజమానికి ఫోన్ చేసి.. తమ కుమారుడు ఏం చేస్తున్నాడో చూడమని చెప్పడంతో అతడు దుకాణంలోకి ప్రవేశించాడు. దీంతో అక్కడ ఉదిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.
అనంతరం అక్కడ దొరకిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్‌లో అమ్మాయి కుటుంబమే ఆమె మరణానికి కారణమని రాసి ఉంది. అమ్మాయి కుటుంబం ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని, ప్రతిరోజూ తనను వేధించిందని కూడా అందులో ఉంది. తనను జైలుకు పంపిస్తామని కూడా బెదిరించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించినట్లు CO సిటీ ఆష్నా చౌదరి తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
