రోజు రోజుకు భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎంతటి శిక్షలు విధిస్తున్నప్పటికి వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఏదో ఒక కారణంతో భర్తలను హత్యచేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. భర్త నిండునూరేళ్లు బతకాలని ఓ భార్య ఉదయమంతా ఉపవాసం చేసింది. సాయంత్రం అదే భర్తకు విషమిచ్చి హత్య చేసింది.
Read Also: Reels in PS: ఎవర్రా మీరంతా.. పోలీస్ స్టేషన్ కూడా వదిలి పెట్టరా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త క్షేమం, దీర్ఘాయుష్షు కోసం చేసే కర్వా చౌత్ సందర్భంగా ఒక మహిళ రోజంతా ఉపవాసం ఉండి పూజలు చేసింది. అనంతరం భర్తకు విషమిచ్చి చంపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శైలేష్ కుమార్ (32) అనే వ్యక్తికి అతని భార్య సవిత వేరే మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని అనుమానించి విషం ఇచ్చి చంపేసింది.
ఆదివారం కర్వా చౌత్ ఆచారంలో భాగంగా శైలేష్ దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించడానికి సవిత ఉపవాసం ఉందని, ఉదయం నుండి శైలేష్ కూడా దాని కోసం ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడని వారు తెలిపారు. సాయంత్రం సవిత ఉపవాసం విరమించేటప్పుడు, ఆమె శైలేష్ తో గొడవ పడింది కానీ త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నట్లు అనిపించింది. ఆ జంట కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత సవిత శైలేష్ ని పొరుగువారి ఇంటికి వెళ్లి ఏదైనా తీసుకురావాలని అడిగి పారిపోయింది.
Read Also:Dangerous Reel: మీ రీల్స్ పిచ్చి తగలెయ్యా.. మరీ రైల్వే వంతెనపై కూడానా..
అతడు బయటకు వెళ్లగానే ఆ ఇంటి నుంచి ఆమె పారిపోయింది.ఈ ఆహారం తిన్న శైలేష్ కొంత సేపటికి తీవ్ర అవస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలిసిన సోదరుడు అతడ్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. విషం కలిపిన ఆహారాన్ని భార్య పెట్టిందని శైలేష్ చెప్పగా సోదరుడు ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు శైలేష్ భార్య సవితను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ript>
