NTV Telugu Site icon

Crime: పిల్లలు లేరనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య.. వారి వయసు 28 ఏళ్లే

Suicide

Suicide

మహారాష్ట్రలోని థానేలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సంతానం కలగలేదని ఓ జంట ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతుడి వయసు 28 ఏళ్ల , మృతురాలి వయసు 25 ఏళ్లు మాత్రమే. ఈ మేరకు స్థానికులు శనివారం పోలీసులు సమాచారం అందించారు.

READ MORE: Malavika Mohanan: ప్రభాస్‌పై మాళవిక ప్రసంసల వర్షం.. ‘రాజాసాబ్‌’ షూటింగ్‌ అప్‌డేట్

అసలు విషయం ఏమిటి?
హరేష్ ఉగాడే (28), అతని భార్య నీలం (25) మృతదేహాలు షాపూర్‌లోని నాద్‌గావ్ ప్రాంతంలోని వారి అపార్ట్‌మెంట్‌లో గురువారం వేలాడుతూ కనిపించాయి. ఇరుగుపొరుగు వారు చూసి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంతానం కలగలేదనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసుపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుంటుంబ సభ్యులకు అందజేయనున్నారు.

READ MORE:Amul: ఎక్స్ యూజర్లపై ‘‘అమూల్’’ ఫిర్యాదు.. తిరుపతి లడ్డూ వివాదమే కారణం..

ఇదిలా ఉండగా.. తాజాగా డెన్మార్క్‌లో నిర్వహించిన అధ్యయనం సంచలన విషయాన్ని తెలిపింది. దీర్ఘకాలంగా వాయు కాలుష్యం, ట్రాఫిక్‌ శబ్దాలకు గురవటానికీ సంతానలేమి సమస్య పెరగటానికీ సంబంధం ఉంటున్నట్టు ఇందులో తేలిసింది. కలుషిత గాలిలోని రసాయనాలు రక్తం ద్వారా పునరుత్పత్తి వ్యవస్థలోకీ చొచ్చుకెళ్లొచ్చు. ఇవి హార్మోన్లను అస్తవ్యస్తం చేయొచ్చట. నేరుగా అండాలు, శుక్రకణాలనూ దెబ్బతీయొచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇలా సంతానం కలగటంలో చిక్కులకు దారితీయొచ్చని అధ్యయనం వెల్లడించింది. అయితే ఆరోగ్యం మీద వాహన శబ్దాల ప్రభావం గురించి అంత స్పష్టంగా తెలియదు. ఇవి ఒత్తిడి హార్మోన్లను ప్రభావితం చేయటం ద్వారా సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశముందని కొన్ని పరిశోధనలు చెబుతున్న మాట మాత్రం వాస్తవం.

Upset About Being Childless, Couple Commits Suicide, Thane District, Maharashtra, Crime