అసలు చట్టాలు అంటు ఒకటిఉన్నాయని.. స్త్రీతో అమర్యాదగా ప్రవర్తిస్తేనే చట్టపరంగా చర్యలుంటాయని తేలియని సమాజంలో బతుకుతున్నారా..? అనే ప్రశ్నలు కొన్నికొన్ని సార్లు వ్యక్తమవుతుంటాయి. ఎందుకంటే ఎన్నిచట్టాలు చేసినా కొందరు కామాంధులు మాత్రం మారడం లేదు. స్త్రీల పట్ల అనుచితంగా వ్యవహరించినవారు కఠినంగా శిక్షింపబడుతున్నా కొంచెం కూడా భయపడకుండా నేరాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరో ఉదాంతం బయట పడించి. బోరబండుకు చెందిన ఓ మహిళ కూలీ పని చేసుకునే దగ్గర వెంకట్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అయితే వీరి వివాహేతర సంబంధాన్ని బయటపెడుతామని బెదిరించి ఇద్దరు దుర్మార్గులు ఆ మహిళపై తమ కామవాంఛ తీర్చుకున్నారు. ఆ తరువాత ఈ విషయాన్ని సదరు మహిళ వెంకట్‌తో చెప్పడంతో అవమానం భరించలేక వీరిద్దరూ వికారాబాద్ అడవిలో పురుగల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఈ విషయం తెలిసిన వెంకట్ సోదరుడు ఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించాడు. చికిత్స అనంతరం ప్రాణపాయ స్థితి నుంచి బయటపడిన సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల ఇస్మాయిల్, యాసిన్ గుర్తించిన ఎస్‌ఆర్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
