Site icon NTV Telugu

Hyderabad : మలక్ పేట్ శిరీష హత్య కేసులో ట్విస్ట్ ..

Untitled Design (80)

Untitled Design (80)

మలక్ పేట్  శిరీష హత్య కేసు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజా ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని, ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెలితే.. కర్నూలు జిల్లాలోని ఈగలపెంట కు చెందిన వినయ్ తో సింగం శిరీషకు 2017 లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆరేళ్ల పాప ఉంది. వినయ్, శిరీష హైదరాబాద్ లో మలక్పేట్ జమున టవర్స్ లో నివాసం ఉంటున్నారు. కాగా, శిరీష సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శిరీష చనిపోయిన విషయాన్ని చెప్పి చెప్పనట్లుగా ఆమె సోదరికి ఫోన్ చేసి చెప్పాడు వినయ్.

ఆమె గుండెపోటుతో మరనించిందని వినయ్ తెలిసినప్పటికి, శిరీష బాడీ మొత్తం దెబ్బలు కనిపించడంతో.. వెంటనే మలక్పేట్ పోలీసులను ఆశ్రయించారు శిరీష కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు, శిరీష మృతదేహానికి ఉస్మానియా మార్చురీకి తరలించారు. అయితే తాజాగా ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ బయట పడింది. తన అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని కోపంతో వినయ్  శీరిష‌ను హత్య చేసినట్లు సమాచారం. ముందురోజు రాత్రి శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత,  దిండుతో ఊపిరాడకుండా చేసి శినిషని హత్య చేశాడు వినయ్. దీంతో వినేయ్ తోపాటు అతని సోదరిని కూడా అరెస్టు చేశారు పోలీసులు.

Exit mobile version