గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. మాదిపాడులని వేదపాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కృష్ణానదిలో స్నానానికి వెళ్లారు. నదిలో దిగిన ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు నదిలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read: ఎలుకల ద్వారా కరోనా…!!?
స్థానికులు మొదట మూడు మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం స్థానిక జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మరో మూడు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నారు. ఆరుగురు విద్యార్థులు మృతి చెందడంతో మాదిపాడులో విషాదఛాయలు నెలకొన్నాయి.
