కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన బాలికపై కామంతో కన్నేశాడు. ఫోన్లోని వ్యక్తిగత ఫోటోలను అడ్డుపెట్టుకుని, సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేసి దారుణానికి తెగబడ్డాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘోరం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును తిరుపతి ఈస్ట్ పీఎస్‌కు బదిలీ చేశారు. నిందితుడు రామమూర్తిపై లైంగికదాడితో పాటు పోక్సో చట్టం కింద పోలీసులు వేట మొదలుపెట్టారు. ఆధ్యాత్మిక పట్టణం తిరుపతిలో దారుణం జరిగింది. ఓ కామోన్మాది.. కూతురు వరసయ్యే బాలికపైనే అరాచకానికి పాల్పడ్డాడు. కాపాడాల్సిన బాబాయే కీచకుడిగా మారి బాలికపై తన కామవాంఛ తీర్చుకున్నాడు. వేసవి సెలవులకు ఇంటికొచ్చిన అమ్మాయిని ప్రైవేట్ ఫోటోలు చూపించి.. భయపెట్టి తన మృగత్వాన్ని ప్రదర్శించాడు. మనిషిగా పుట్టి.. పశువులు కూడా చేయనంత దారుణానికి తెగబడిన వ్యక్తి అరాచకాన్ని బాధితురాలి తల్లి బయటపెట్టడంతో అతనిపై పోక్సో కేసు నమోదైంది.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. సాయిలక్ష్మి, రమేష్ దంపతుల కుమార్తె అయిన అమ్మాయి.. ఏప్రిల్‌లో పరీక్షలు పూర్తయ్యాక వేసవి సెలవుల కోసం తిరుపతిలోని తన పిన్ని మానస ఇంటికి వెళ్లింది. అక్కడ పిన్ని భర్త అయిన రామమూర్తి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తిరుపతి జీఎస్టీ ఆఫీసులో పనిచేస్తున్న నిందితుడు రామమూర్తికి బాధితురాలు స్వయానా కూతురు వరుస అవుతుంది. ఆ బాలిక ఫోన్లో ఉన్న కొన్ని వ్యక్తిగత నగ్న ఫొటోలను చూసిన నిందితుడు.. వాటిని తన సెల్‌ఫోన్‌లోకి మార్చుకున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని.. వైరల్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు.ఈ ప్రైవేట్ ఫోటోలను అడ్డుపెట్టుకుని భయపెడుతూ బాధితురాలిపై రామమూర్తి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె తిరిగి హైదరాబాద్‌లోని తన ఇంటికి వెళ్లిపోయినా ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం మానలేదు. తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తూ తీవ్రంగా వేధించాడు. పరీక్షలు రాసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలిక నిరంతరం మానసికంగా కుంగిపోవడాన్ని తల్లిదండ్రులు గమనించారు. తల్లి ఆమెను నిలదీయగా అసలు విషయం బయటపడింది. బాబాయే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి తల్లి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. బాలిక నుంచి సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
వాయిస్: బాధితురాలి తల్లి వెంటనే హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలం తిరుపతి పరిధిలో కావడంతో జగద్గిరిగుట్ట పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. అనంతరం తదుపరి దర్యాప్తు కోసం కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు నిందితుడు రామమూర్తిపై పోక్సో చట్టం కింద కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికలను ఇతర ప్రాంతాలకు, బంధువుల ఇళ్లకు పంపేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారి ప్రవర్తనలో మార్పులను గమనిస్తూ ఉండాలని కోరారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రామమూర్తి కోసం తిరుపతి పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
