NTV Telugu Site icon

Punjab firing: పంజాబ్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి

Firing

Firing

పంజాబ్‌లో పట్టపగలు తుపాకీ కాల్పులతో దద్దరిల్లిండి. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాల్పుల శబ్దంతో భయాందోళన చెందారు. ఫిరోజ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Sandip Ghosh: ‘ఆర్థిక అవకతవకల’ కేసులో సందీప్ ఘోష్‌ను 8 రోజుల సీబీఐ కస్టడీ..

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కారుపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అందులో ఉన్న ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారు తీవ్రంగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. ట్రిపుల్ మర్డర్ వెనుక అసలేం జరిగింది అన్నదానిపై లోతుగా దర్యాప్తు చేస్తు్న్నారు. అలాగే సమీపంలో ఉన్న సీసీకెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: WTC Final 2025: WTC ఫైనల్ షెడ్యూల్ ఫిక్స్..

ఇది ట్రిపుల్ మర్డర్ అని డీఐజీ అజయ్ మలుజా తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతులు ఆకాష్‌దీప్, దిల్‌ప్రీత్, జస్ప్రీత్ కౌర్‌గా గుర్తించారు. దిల్‌ప్రీత్‌కు గతంలో నేర చరిత్ర ఉందని తెలిపారు. పరస్పర శత్రుత్వంతోనే ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోందన్నారు. సీసీ టీవీ పుటేజ్ ద్వారా నిందితులను గుర్తించినట్లు పేర్కొన్నారు. హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లు తెలిపారు.

 

Show comments