Thief Escaped: తరుచూ దొంగతనాలు చేస్తున్న దొంగను స్థానికులు పక్కా ప్లాన్ తో మాటు వేసి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసులు అతనిని స్టేషన్ ఉంచారు. అయితే దొంగ పోస్టేషన్ నుంచే పోలీసులు కళ్లుగప్పి పరారయ్యాడు. వెంటనే అతడిని వెతికి పట్టుకుని జైల్లో పెట్టారు. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ ఖాకీలను మస్కా కొట్టి పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయాడు. రెండుసార్లు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న ఘటన యూసఫ్ గూడలో చోటుచేసుకుంది.
Read also: Fishermens Arrest: శ్రీలంక నేవీ అదుపులో 22 మంది తమిళ మత్స్యకారులు..
హైదరాబాద్ యూసుఫ్ గూడ సమీపంలోని యాదగిరినగర్ లో ఇటీవలి కాలంలో ఇళ్లలోని కుళాయిలు చోరీకి గురవుతున్నాయి. అనుమానం వచ్చిన స్థానికులు సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా దొంగ నల్లాలను దోచుకుంటున్నట్లు కనిపించింది. ఈ వీడియోలను బస్తీ కమిటీ నేతలు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారు. ఎట్టకేలకు ఈ నెల 1వ తేదీన దొంగను స్థానికులు పట్టుకున్నారు. యాదగిరి నగర్ ప్రధాన కార్యదర్శి కె.మహేందర్ దొంగను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. పట్టుబడిన దొంగను నేపాల్‌కు చెందిన వికాస్‌గా గుర్తించారు. అయితే అదే రోజు పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరారయ్యాడు. శుక్రవారం జూబ్లీహిల్స్ ప్రాంతంలో దొంగను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఆదివారం సాయంత్రం మళ్లీ మధురానగర్ పోలీసులకు ముసుగు వేసుకుని పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పారిపోయాడు. ఈ క్రమంలో విధి నిర్వహణలో పోలీసుల నిర్లక్ష్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దొంగ పోలీస్టేషన్ నుంచి పారిపోతున్నా పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. దొంగలను పోలీసులే విడిపెట్టి పారిపోతున్నారని చెబుతున్నారని విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై పోలీసుల నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడం గమనార్హం.
Kishan Reddy: అభివృద్ధి అంటే హైటెక్ సిటీ కాదు.. పాత బస్తీని చేయండి..