Site icon NTV Telugu

అయ్యో ఎంతటి దారుణం.. ఈ తల్లి కష్టం పగోడికి కూడా రాకూడదు

అమ్మ ప్రేమ.. లోకంలోనే మధురమైనది.. కడుపునపుట్టిన బిడ్డల కోసం ఎన్ని కష్టాలైనా భరించేది తల్లి ఒక్కటే.. చివరికి చావు బతుకుల మధ్య ఉన్నా కూడా ఆమె గుండె పిల్లల కోసమే కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటి తల్లి ప్రేమ.. పేదరికం ముందు ఓడిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో బిడ్డను ఎలా పోషించాలో తెలియని ఒక అభాగ్యురాలైన తల్లి.. తన మూడురోజుల బిడ్డను అమ్మేసింది. తన బిడ్డ అయిన తనలా కాకుండా పెరుగుతుందని అనుకున్నాడో ఏమో.. పిల్లలు లేని ఒక జంటకు తన బిడ్డను రూ 1.78 ల‌క్ష‌ల‌కు అమ్ముకుంది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లాలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. షిర్డీ గ్రామనికి చెందిన ఒక మహిళ(32) ఇటీవలే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా సమయంలో వారిని జీవ స్థితి దిగజారిపోయింది. దీంతో ఆ మహిళ పేదరికంలో మగ్గిపోయింది. కనీసం తన బిడ్డకు కూడా పాలు కొనలేని స్థితి.. దీంతో ఆ మహిళా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. తన బిడ్డ అయినా మంచిగా బతకాలని ఒక జంటకు పసికందును అమ్మాలని నిర్ణయించుకుంది. దానికి వారి ఇంటిపక్కనే ఉన్న మరో ముగ్గురు హెల్ప్ చేశారు. లీగల్ చర్యలు లేకుండానే పసికందును తల్లి రూ 1.78 ల‌క్ష‌ల‌కు అమ్మేసింది. పుట్టిన పసికందును అనైతికంగా అమ్ముతున్నారని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అరెస్ట్ చేశారు. తన పేదరికం వలనే ఈ పని చేస్తున్నట్లు తల్లి పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version