Site icon NTV Telugu

Telangana: నిజామాబాద్ బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..

Hyderabadad

Hyderabadad

తెలంగాణాలోని ప్రముఖ ఆసుపత్రుల్లో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.. తాజాగా నిజామాబాద్ లోకి ప్రముఖ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది..ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.. వెంటనే ఫైరింజన్లకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరిన ఫైరింజన్లు దాదాపు ఒక గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు..

ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు.. బయటకు పరుగులు తీశారు.. ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ థియేటర్ ఉన్న ఫ్లోర్ లో ఉన్న రోగులను గ్రౌండ్ ఫ్లోర్ లోకి తరలించారు. రోగులను గ్రౌండ్ ఫ్లోర్ కు తరలించారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆపరేషన్ థియేటర్ పూర్తిగా కాలి బూడిద అయ్యింది.. ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు గుర్తించారు..

 

ఇక్కడే కాదు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది మే 20వ తేదీన న్యూఢిల్లీలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..ఇలా ఆసుపత్రుల్లో గత రెండేళ్లుగా వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఆసుపత్రులకు వెళ్లాలంటే కొన్ని ప్రాంతాల్లో రోగుల భయపడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి..

Exit mobile version