NTV Telugu Site icon

Telangana : మెదక్ లో దారుణం.. ప్రియుడితో కలసి భర్తను అతికిరాతకంగా చంపిన భార్య..

Crime News

Crime News

అక్రమ సంబంధాల మోజులో పచ్చటి సంసారాలను చేతులారా నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న భార్య లేదా భర్తలను అతి దారుణంగా చంపేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణాలో మరో దారుణం చోటు చేసుకుంది.. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి కట్టుకున్నభర్తనే కడతేర్చింది భార్య.. పోలీసుల ఎంట్రీ తో అసలు విషయం బయటకు వచ్చింది..

వివరాల్లోకి వెళితే.. జిల్లాలో రామేశ్వరంపల్లి కి చెందిన మైలి నవీన్ కుమార్ అతని భార్య ఉదయరాణి గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. నవీన్ కుమార్ ఇద్దరు కుమార్తెలు మెదక్ జిల్లాలోని అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు.. నవీన్ కుమార్ ఇంటి పక్కనే నివసిస్తున్న తరుణ్ అనే యువకుడితో అతని భార్య ఉదయరాణికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఉదయరాణి భర్తకు తెలియడంతో కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

సోమవారం కూడా గొడవ జరిగింది.. ఇక ప్రియుడితో సుఖం కావాలంటే భర్తను అడ్డు లేకుండా చెయ్యాలని కోరింది. నవీన్ ను, మద్యం తాగుదామని తరుణ్ బయటికి తీసుకొని వెళ్ళాడు. నవీన్ కు ఎక్కువగా మద్యం తాగించిన తర్వాత,తరుణ్ అతనిని ఇంటికి తీసుకొస్తుండగా మధ్యలో నవీన్ కింద పడిపోయాడు.. అలానే ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టారు.. ఆ తర్వాత ఇంటి సంపులో ముంచి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. నవీన్ కింద పడడంతో తలకు బాగా దెబ్బ తగలడంతో మృతి చెందాడని సమాచారం అందించింది. వెంటనే అతని తల్లి, అన్నలు అక్కడికి చేరుకున్నారు. నవీన్ తలకు, మెడపై గాయాలు ఉండడం గమనించి, ఉదయరాణిని గట్టిగా నిలదీశారు. దీంతో ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది.. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహన్ని పోస్ట్ మార్టం కు తరలించి, ఉదయారాణి తరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..