NTV Telugu Site icon

Bihar Crime: 14 ఏళ్ల బాలికను గన్‌తో బెదిరించి, కారులో తిప్పుతూ అత్యాచారం..

Gangrape

Gangrape

Bihar Crime: బీహార్‌‌లో దారుణం జరిగింది. రాజధాని పాట్నాకు 180 కి.మీ దూరంలోని సహర్సాలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గన్‌తో బెదిరించి బాలికను కారులోకి ఎక్కించుకుని ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను బిట్టు, అంకుష్‌గా గుర్తించారు. శనివారం ఈ ఘటన జరిగింది. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శనివారం మధ్యాహ్నం బాలిక మేకలను మేత కోసం తీసుకెళ్లింది. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో కారులో వచ్చిన ఇద్దరు నిందితులు ఆమె తలకు తుపాకీ గురిపెట్టి కారులోకి ఎక్కించారు. ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారాని పాల్పడ్డారు. కారులో బాలిక అరుపులు బయటకు వినిపించకుండా బిగ్గరగా మ్యూజిక్ పెట్టారు. దాదాపు రెండు గంటల తర్వాత రోడ్డు పక్కన బాలికను విడిచిపెట్టారు.

Read Also: Kinjarapu Ram Mohan Naidu: ‘స్వచ్ఛత సేవ’ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన నాయుడు..

ఇంటికి వచ్చిన బాలిక ఈ లైంగిక దాడి గురించి తల్లిదండ్రులకు ముందు చెప్పలేదు. బాలిక ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని చెప్పకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కొట్టారు. బాలిక అత్త అసలు ఏం జరిగిందని ఆరా తీయగా, తనకు జరిగిన అన్యాయం గురించి బాలిక చెప్పింది. బాలిక బయటకు వెళ్లిన ప్రతీసారి నిందితులిద్దరు తప్పుడు ఉద్దేశంతో చూసేవారని చెప్పింది.

అయితే, నిందితులు ఈ విషయం బయటకు రాకుండా బాలిక కుటుంబానికి డబ్బులు ఇస్తామని, అమ్మాయి పెళ్లికి సాయం చేస్తామని ఆశ పెట్టినట్లు బాలిక అత్త చెప్పింది. తమకు డబ్బులు వద్దని, న్యాయం కావాలని బాలిక తండ్రి కోరాడు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాలికను వైద్యపరీక్షల కోసం పంపారు. తదుపరి విచారణ జరుగుతోంది.

Show comments