NTV Telugu Site icon

మసాజ్ ముసుగులో వ్యభిచారం

హైదరాబాద్ లో మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. మసాజ్‌ సెంటర్‌ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్12 లో కొందరు ‘ఎలిగంట్‌ బ్యూటీ స్పాలూన్‌, అథర్వ హమామ్‌ స్పా’ పేర్లతో మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు.

అయితే ఈ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. మసాజ్ సెంటర్‌ నిర్వాహకులతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్‌ పోలీసులకు నిందితులను అప్పగించారు.